తెలంగాణలో ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్సల ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేసిన ప్ర‌భుత్వం

Covid-19 test rates fix in Telangana.తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్స, వైద్య ప‌రీక్ష‌లు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2021 7:30 AM GMT
తెలంగాణలో ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్సల ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా చికిత్స, వైద్య ప‌రీక్ష‌లు, అంబులెన్సు చార్జీల‌కు గ‌రిష్ఠ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు చార్జీల‌పై వైద్య ఆరోగ్య శాఖ‌ జీవో నంబ‌రు 40 జారీ చేసింది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్ఠంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో గ‌రిష్ఠంగా రూ.7,500, వెంటిలేట‌ర్ తో కూడిన ఐసీయూ గ‌ది చికిత్స‌కు గ‌రిష్ఠంగా రూ.9 వేలు మాత్ర‌మే ఛార్జ్ చేయాలని ఆదేశించింది. పీపీఈ కిట్ ధ‌ర రూ.273 మించ‌రాదంది.

నిర్ణ‌యించిన ధ‌ర‌లు ఇవే..

- సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్టంగా రూ.4వేలు

- ఐసీయూలో గ‌దిలో రోజుకు గ‌రిష్టంగా రూ.7500

- వెంటిలేట‌ర్ తో కూడిన ఐసీయూ గ‌దికి రోజుకు గ‌రిష్టంగా రూ.9వేలు

- పీపీఈ కిట్ ధ‌ర రూ.273

- హెచ్ఆర్సీటీ-రూ.1,995

- డిజిట‌ల్ ఎక్స్‌రే- రూ.1,300

- డీ డైమ‌ర్ ప‌రీక్ష‌-రూ.300

- సీఆర్పీ-రూ.500

- ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400

- ఫెరిటిన్-రూ.400

- ఎల్డీహెచ్‌-రూ.140

- ఎల్ డీహెచ్ రూ.140

- సాధార‌ణ జీవ‌నాధార వ్య‌వ‌స్థ ఉన్న అంబులెన్స్‌కు కిలో మీట‌ర్‌కు రూ.75, క‌నీసం రూ.2వేలు

- ఆధునిక జీవ‌నాధార వ్య‌వ‌స్థ ఉన్న అంబులెన్స్‌కు కిలోమీట‌ర్‌కు రూ.125, క‌నీసం రూ.3వేలు

Next Story
Share it