'టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి'.. బీజేపీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు

Counter false propaganda of TRS, Kishan Reddy tells BJP cadres. హైదరాబాద్‌: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థంగా

By అంజి  Published on  21 Nov 2022 8:26 AM IST
టీఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి.. బీజేపీ కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థంగా ఎదుర్కోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శామీర్‌పేటలో ప్రారంభమైన మూడు రోజుల పార్టీ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు. వచ్చే ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజలకు చెప్పాల్సిన పని లేదని, అందుకే బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తోందని సికింద్రాబాద్‌ లోక్‌సభ సభ్యుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలు పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడం మానేస్తామని ప్రజలను బెదిరించడంతొ గెలిపించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మునుగోడులో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, 2023 ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.

Next Story