ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కార్పొరేట్ త‌ర‌హా వైద్యం : మంత్రి హ‌రీశ్‌రావు

Corporate facilities in Government hospitals says Minister Harish rao.ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్ట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 7:01 AM GMT
ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కార్పొరేట్ త‌ర‌హా వైద్యం  : మంత్రి హ‌రీశ్‌రావు

నిమ్స్ ఆస్ప‌త్రిలోని న్యూరో విభాగంలో రూ.2కోట్ల‌తో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్ట‌ర్ డ‌యాల‌సిస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చిన మొద‌టి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇంత‌క‌ముందు ఇది కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా పేద‌ల‌కు సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్‌ సిస్టం ద్వారా డయాలసిస్ అందిస్తున్న‌ట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 10 వేల మందికి డయాలసిస్ చేస్తున్నామ‌న్నారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి బస్‌పాస్‌, పెన్షన్లు, ఉచితంగా మందులు అందిస్తున్న‌ట్లు చెప్పారు. డయాలసిస్‌కు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రతి సంవ‌త్స‌రం ఆరోగ్య శ్రీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్న‌ట్లు చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాల కోసం రూ.150 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

శుధ్ధి చేసిన తాగు నీటిని అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వ్యాథుల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి రోగాలు రాకుండా చూసుకోవాల‌న్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్లు చాలా వ‌ర‌కు నిమ్స్‌లోనే జ‌రుగుతున్నాయన్నారు. నిమ్స్‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. డిస్సెన్స‌రీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వైద్య సిబ్బంది యాజ‌మాన్యంతో పనిచేయాలని, పేదలకు మంచి వైద్యం అందించాలని మంత్రి హ‌రీశ్ రావు సూచించారు.

Next Story