తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్‌ కేసులు

corona cases updat .. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 622 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

By సుభాష్  Published on  6 Dec 2020 3:13 AM GMT
తెలంగాణలో కొత్తగా 622 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 622 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,73,341 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1472 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 993 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,63,744 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక యాక్టివ్‌ కేసులు 8,125 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 6,116 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇక తాజాగా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.





Next Story