కాంట్రాక్ట్ పే పోస్టర్లతో మాకు సంబంధం లేదు : ఫోన్ పే

Contract pay posters have nothing to do with phone pay. నల్గొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ

By అంజి  Published on  14 Oct 2022 5:14 PM IST
కాంట్రాక్ట్ పే పోస్టర్లతో మాకు సంబంధం లేదు : ఫోన్ పే

నల్గొండ జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు విజయం సాధించేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రానున్న ఉప ఎన్నికల్లో తమను తాము నిరూపించుకునేందుకు తెలంగాణ నేతలు ఏ మాత్రం వెనుకంజ వేయలేకపోతున్నారు.

ఇక ఇటీవల భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి వ్య‌తిరేకంగా చండూరు ప‌ట్ట‌ణ‌మంతా పోస్ట‌ర్లు వెలిశాయి. కాంట్రాక్ట్‌ పే అంటూ రూ. 18000 కోట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందంటూ రాత్రికి రాత్రే ప‌ట్ట‌ణంలోని షాపులు, గోడ‌ల‌కు అతికించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే ఇందులో ఫోన్ పే తరహాలోనే కాంట్రాక్ట్ పే పేరుతో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ వ్యవహరంపై ప్రధాన పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధం కొనసాగింది. అయితే తాజాగా ఈ పోస్టర్ల పై ఫోన్ పే సంస్థ స్పందించింది.

కాంట్రాక్ట్‌ పే పేరుతో పలు మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ ఆన్‌లైన్‌ మనీ ట్రాన్సక్షన్‌ యాప్‌ ఫోన్‌ పే స్పష్టం చేసింది. తమకు ఏ కంపెనీతో గానీ, పార్టీ, అభ్యర్థి, రాజకీయ పార్టీలతోనూ సంబంధంలేదని పేర్కొంది. కాంట్రాక్ట్ పేను రూపొందించటంలో ఫోన్ పే లోగోను ఉపయోగించటం తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. ఇది ఫోన్ పే మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలపై తీసుకునే హక్కు తమకు ఉంటుందని ఫోన్ పే వెల్లడించింది.

Next Story