రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గతంలో గుజరాత్ లో నరేంద్ర మోడీ పారచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారన్నారు. అమిత్ షా, మోడీ ఇద్దరు బిల్లా రంగాలు.. దేశాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పరిపాలిస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎన్నికల్లో మీకు పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి.. నితీష్, చంద్రబాబు లాంటి వారి వల్ల మీ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. 2009లో రాహుల్ ప్రధాని కావాలని మన్మోహన్ లాంటివారు కోరారు.. మోడీ లాగా ఎన్నికల్లో గెలవకున్నా.. సీఎం అయినట్లు.. రాహుల్ కు అవకాశం వచ్చినా పీఎం కాలేదన్నారు..
బ్రిటిష్ పాలన తర్వాత దేశంలో కాంగ్రెస్ ఎన్నో సంస్కరణలు తెచ్చిందన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లే ఈరోజు సామాన్యులకు పదవులు వచ్చాయన్నారు. బండి సంజయ్‌కి కూడా పదవి రావడానికి రాజ్యాంగమే కారణం అన్నారు.
మీరు కొంతమంది కోసమే పనిచేస్తున్నారు.. గత బిఆర్ఎస్ పాలనలో పదేళ్లు ఎలా దోచుకున్నారో కిషన్ రెడ్డికి తెలియంది కాదు.. రాష్ట్రాన్ని పదేళ్లు లూటీ జరగకుండా ఎందుకు ఆపలేదు ? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు ఒక్కసారి కూడా మీరు పట్టించుకోలేదు ? అని ప్రశ్నలు సంధించారు.
గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసినప్పుడు మేయర్ గా కాంగ్రెస్ ఉన్నా.. మంచి పనికి మేము మద్దతు ఇచ్చాము. మేము మూసీని డెవలప్ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.