బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి మా ప్రభుత్వం పై చార్జ్ షీట్ విడుదల చేశారన్నారు

By Kalasani Durgapraveen  Published on  2 Dec 2024 2:39 PM IST
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా..?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి మా ప్రభుత్వం పై చార్జ్ షీట్ విడుదల చేశారన్నారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా..? అన్నారు .

కనీస మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై ఇప్పటివరకు స్పందన లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న వడ్లకి 500 బోనస్ ఇస్తున్నాం అని తెలిపారు. 110 కోట్ల ఉచిత బస్ టికెట్లు ఇచ్చాం అన్నారు. ఏడాదికి 20వేల కోట్ల రూపాయలు వరకు సంక్షేమ కార్యక్రమాలకి ఇస్తున్నాం అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాపి చేస్తున్నారా..? యూపీ ప్రభుత్వం హయాంలో సోనియాగాంధీ జాతీయ స్థాయిలో రుణమాపి చేసిందన్నారు. బీజేపీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షలు వేస్తాం అన్నారు. పెట్రోలియం, డీజిల్ 70 ఉంటే ఇప్పుడు 100 పైనే ఉంది.. నిత్యావసర ధరలు ఆకాశాని అంటుతున్నాయి అన్నారు. మేము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ రాష్ట్రాల్లో అమలు చేయండి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నరాన్నారు.

Next Story