ఆ మాట‌తో ఖంగుతినే ఈటెల రూ.25 కోట్ల ఆరోపణలు చేశారు..!

Congress Leader Addanki Dayakar Fire On Etela Rajender. ఈటెల రాజేందర్ రూ.25 కోట్ల కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు

By Medi Samrat  Published on  23 April 2023 8:15 PM IST
ఆ మాట‌తో ఖంగుతినే ఈటెల రూ.25 కోట్ల ఆరోపణలు చేశారు..!

ఈటెల రాజేందర్ రూ.25 కోట్ల కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. టీపీసీసీ అధికార ప్ర‌తినిధి అద్దంకి దయాకర్ గాంధీ భ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ నీ మాటలు.. నీ ఆరోపణలతో మా అధ్యక్షుడు కన్నీరు పెట్టె వరకు తీసుకోవచ్చావు.. నీ ఆరోపణలు ఆధారాలు లేకుండా అడ్డ‌గోలుగా మాట్లాడిన మాట‌లేన‌న్నారు. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నిన్ను పొగిడి మాట్లాడినపుడే.. నువ్ ఏ పార్టీ తొత్తుగా ఉన్నావో అర్థం అయ్యింద‌ని అన్నారు. అమిత్ షా, మోదీ లు ఐటెం సాంగ్ లాగా తెలంగాణ కు వచ్చి పోతున్నారని ఎద్దేవా చేశారు.

కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారిని ఈటెల కలిశారు. వారు బీజేపీలో నువ్ కూడా ఓడిపోతావని చెప్పడంతో ఖంగుతిన్న ఈటెల.. ఇలా రూ.25 కోట్ల ఆరోపణలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన అలుపెరగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని కాపాడుతున్నది కేసీఆర్.. కేసీఆర్ ను కాపాడుతున్నదే మోదీ.. షా.. అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కావు.. మేము ఆ రెండు పార్టీ లపై పోరాటం చేస్తున్నామ‌న్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం యావత్తు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పిచ్చి మాటలను మాట్లాడితే ఈటెల మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చ‌రిక‌లు జారీచేశారు.


Next Story