అద్దంకి దయాకర్ కు ఊహించని షాక్

అద్దంకి దయాకర్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది..

By Medi Samrat  Published on  17 Jan 2024 5:22 PM IST
అద్దంకి దయాకర్ కు ఊహించని షాక్

అద్దంకి దయాకర్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది.. అందులో అద్దంకి దయాకర్ పేరు కనిపించలేదు. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌ పేర్లను విడుదల చేసింది. గురువారంతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుండగా.. బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్‌కే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేయబోతున్నారని ప్రచారం జరుగగా కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాకిచ్చింది.


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి చివరి నిమిషంలో పలు మార్పులు చేర్పులు చేశారు. రెండు స్థానాలకు గాను మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. జాబితా నుంచి అద్దంకి దయాకర్ ను ఎందుకు పక్కన పెట్టారో తెలియాల్సి ఉంది. అద్దంకి దయాకర్ ను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది.

Next Story