ఈటెల కుమారుడిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు ఆదేశించిన‌ సీఎం కేసీఆర్‌

Complaint Against Etela Rajendar Son. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో

By Medi Samrat
Published on : 23 May 2021 3:24 PM

Etela Rajendar

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు. తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం ఆదేశించారు.





Next Story