యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎంలు
CMs of four states performed special pooja at Yadadri temple. ఖమ్మం బహిరంగ సభ కోసం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లలో జాతీయ నేతలు
By అంజి Published on 18 Jan 2023 6:30 AM GMTఖమ్మం బహిరంగ సభ కోసం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లలో జాతీయ నేతలు బయలుదేరారు. మొదటి హెలికాప్టర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేరళ సీఎం పినరయి విజయన్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ రెండో హెలికాప్టర్‌లో ఉన్నారు. బేగంపేట నుంచి బయల్దేరిన రెండు చాపర్లలో ముఖ్యమంత్రులు యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ గర్భగుడిలో నలుగురు సీఎంల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి ఆలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.కేరళ సీఎం విజయన్ ఆలయ సందర్శనకు వెళ్లలేదు. ఆయన ప్రెసిడెన్షియల్ సూట్‌లోనే ఉన్నారు
CM Sri. KCR along with 3 States Chief Ministers Visits Yadadri Sri Laxmi Narasimha Swamy Temple#BRSforIndia #AbkiBaarKisanSarkar pic.twitter.com/Srerd5e5Fa
— Pyata Santhosh Kotari (@PSKTRS_) January 18, 2023
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఖమ్మం వెళ్లే ముందు ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మరోవైపు కంటి వెలుగు వేదిక వద్ద భారీ ఆంక్షలు విధించారు. ఎంపికైన వ్యక్తులను మాత్రమే వేదిక లోపలికి అనుమతిస్తారు. సీఎస్ శాంతికుమారి కూడా హాజరుకానున్నారు. సాయంత్రం ఖమ్మంలో బహిరంగ సభ అనంతరం నేతలు, ముగ్గురు సీఎంలు విజయవాడ వెళ్లి గన్నవరం విమానాశ్రయంలో తమ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ముందుగా నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు ఛాపర్లు బయలుదేరాయి. ఏపీ నుండి కూడా మంచి సంఖ్యలో బీఆర్‌ఎస్ ప్రజలను సమీకరించింది. బస్సులు, ఇతర వాహనాల్లో ఖమ్మం చేరుకుంటున్నారు.
Live: Visit of CM Sri KCR and Chief Ministers of 3 States to Yadadri Sri Laxmi Narasimha Swamy Temple https://t.co/BVrLWjKiTP
— Telangana CMO (@TelanganaCMO) January 18, 2023
విశాఖపట్నంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ
త్వరలో ఏపీలోని విశాఖపట్నంలో భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన తన అనుచరులతో కలిసి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో వైజాగ్ బహిరంగ సభకు తేదీని కూడా ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
#Telangana CM KCR before starting to #Yadadri with Delhi, Punjab, Kerala CMs at #PragathiBhavan ahead of #BRSMeeting pic.twitter.com/fXllwNSAkz
— Nellutla Kavitha (@iamKavithaRao) January 18, 2023