Telangana: రేషన్‌ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్‌ సరకులకు సంబంధించి మరో తీపి కబురు అందించింది.

By అంజి  Published on  23 Sept 2024 7:24 AM IST
CM Revanth, telangana government, ration cards

Telangana: రేషన్‌ కార్డులు ఉన్న వారికి శుభవార్త

హైదరాబాద్‌: అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్‌ సరకులకు సంబంధించి మరో తీపి కబురు అందించింది. రేషన్‌ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ డిజిటల్‌ కార్డు అందిస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం రేవంత్‌ సూచించారు.

ఇదిలా ఉంటే.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ఉమార్‌రెడ్డి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీ రేషన్‌ కార్డుల జారీపై విధివిధానాలను ప్రభుత్వానికి అందించనుంది. ఆ వెంటనే అక్టోబరులో కొత్త రేషన్‌ కార్డుల జారీ కొరకు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా.. తాజాగా కొత్త రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు విడివిడిగా అందజేయనున్నారు.

Next Story