తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి: సీఎం రేవంత్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల...

By -  అంజి
Published on : 7 Feb 2026 6:24 AM IST

CM Revanth, cooperation, people, development of Telangana, Nizamabad

తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి: సీఎం రేవంత్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. "ప్రజాపాలన – ప్రగతిబాట" కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు) కు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు. “నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరు. ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శం. ఈ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా” అని చెప్పారు.

ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు:

- రూ. 20 కోట్లతో #TelanganaUniversity దిచ్‌పల్లిలో ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం.

- గిరిజన సంక్షేమ శాఖ – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్‌వాయిలో సిబ్బంది నివాస గృహాలు (స్టాఫ్ క్వార్టర్స్), అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులు.

- ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం.

- రూ. 8.60 కోట్లతో తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణం.

- అలాగే యూనివర్సిటీలో 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం. రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో వర్సిటీ ఆడిటోరియం, పరిపాలనా భవనం, సీఎస్ఈ భవనాల విస్తరణ పనులు

- రూ. 18 కోట్లతో చేపట్టిన యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం

- రూ. 21 కోట్ల అంచనా వ్యయంతో నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు వరకు (0/0 కి.మీ నుండి 5/8 కి.మీ), పీడబ్ల్యూడీ & జేఎన్‌ఎన్ రోడ్డు నుండి సిరన్‌పల్లి మీదుగా నిజాంపూర్ వరకు (0/0 కి.మీ నుండి 8/2 కి.మీ) రోడ్డు వెడల్పు పనులు.

ఈ సభలో మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌ అలీతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story