వాళ్లనలా చూస్తే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
స్కూల్ విద్యార్థినిలు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 4:35 PM ISTవాళ్లనలా చూస్తే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. ఈ పథకం కింద తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఈ జర్నీ సాగుతుంది. కాగా.. తాజాగా ఈ పథకాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. స్కూల్‌కు వెళ్లేందుకు వారలా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వాడుకోవడం చూస్తే సంతోషంగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు సంబంధించిన ఫొటోలను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయణ పథకం వల్ల.. తాము ఫ్రీగా బస్సు ఎక్కి స్కూల్‌కి వెళ్తున్నామని విద్యార్థులు చెప్పారు. స్టూడెంట్స్ తమ చేతిలో ఉన్న ఆధార్ కార్డులను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలనే సీఎం రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలను చూసినప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడు అందే ఆనందం వేరుగా ఉంటుందన్నారు.
సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది…ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల… pic.twitter.com/rZs03J38wG
— Revanth Reddy (@revanth_anumula) June 14, 2024