రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎవడు తొలగిస్తాడో చూస్తా..సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 7:00 PM ISTతెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశంపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా అంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రండి... విగ్రహాన్ని ఎవడొచ్చి తొలగిస్తాడో నేను కూడా చూస్తా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలపై నోరు జారితే ఫాంహౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తా అని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తామే పెడతామని స్పష్టం చేశారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అలాగే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేశారు. తెలంగాణను మొత్తం దోచుకోవాలిచ, తామే దోచుకోవాలని కేసీఆర్ ఫ్యామిలీ భావిస్తోందని అన్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడతారని వాళ్లు ఊహించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో అధికారం పోయింది.. ప్రజా పాలన వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడీలు బద్దలై పోయాయన్నారు. బీఆర్ఎస్ నాయకుల బతుకులు దివాలా తీశాయనే వాస్తవలు కేసీఆర్‌కు అర్థం కావడం లేదని అన్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు చిల్లరమల్లరగార మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాంధీ కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారనీ.. మరి వారు చేసిందేటి అంటూ ప్రశ్నించారు. త్యాగం అంటేనే సోనియాగాంధీ అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అన్నారు. కంప్యూటర్లు రాకపోతే సిద్ధిపేటలో ఇడ్లీ, వడ అమ్ముకునేవాళ్లని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేతలు హంగామా చేశారనీ.. దశాబ్దాల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశానికి కంప్యూటర్లను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. pic.twitter.com/VyztxkYGX0
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 16, 2024