తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో విచారణ కోసం హాజరుకావాలని సూచించింది. కాగా.. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణకు మత్తయ్య హాజరు అయ్యారు. రేవంత్‌రెడ్డి సహా మిగితా వారు కూడా విచారణకు హాజరుకాలేదు. దాంతో.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు.. ఉదయ్ సిన్హా, వేంకృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ వెళ్లలేదు. ఈ క్రమంలోనే న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది.
విచారణకు హాజరుకాకపోవడంతో.. నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మంగళవారం నాటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో అంగీకరించింది. కానీ.. అక్టోబర్ 16వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సహా మిగతా వారికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.