మేం ఎవరి జోలికి వెళ్లం.. ఎవరైన వస్తే మాత్రం ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో ఇటీవల కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ అంశం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 8:15 PM ISTతెలంగాణలో ఇటీవల కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ అంశం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరి జోలికి వెళ్లరనీ.. అదే సమయంలో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ల జోలికి వస్తేమాత్రం ఊరుకోమని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు అనీ.. ఆయన వెనున తాను ఉంటానని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ నాయకులు ఎవరి జోలికి వెళ్లరు కానీ.. తమ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే మాత్రం ఊరుకోరు అన్నారు. రా చూసుకుందాం అంటూ కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ చేశాడంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా సవాల్ అంశాన్ని కూడా ప్రస్తావించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అలాగే ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించార్నారు. రూ.2లక్షల రుణమాపీ చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి
రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజీనామా సవాల్ చేసిన హరీశ్‌రావు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రాజీనామా చేయకుండా దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలను హరీశ్‌రావుకి పంపిస్తామనీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక హరీశ్ రావు సవాల్‌ను పాటించాలని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.