అన్ని పథకాలకు ఒకటే కార్డ్‌.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌: సీఎం రేవంత్‌రెడ్డి

కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  3 Oct 2024 2:56 PM IST
అన్ని పథకాలకు ఒకటే కార్డ్‌..  ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌: సీఎం రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్‌ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్‌ కార్డ్‌లు మూసీ సుందరీకరణ,కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలపై చేశారు.ప్రధాని మోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మేం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

డిజిటల్ కార్డుల గురించి మాట్లాడుతూ.. 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్‌ కార్డ్‌లను రూపొందించామని చెప్పారు. అన్ని చోట్ల అధ్యయనం చేసి డిజిటల్‌ కార్డ్‌లు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పేదవాడికి రేషన్‌ కార్డ్‌లను ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నామనీ... రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డ్‌ ఇవ్వాలని అన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డ్‌ ఇవ్వాలేదంటూ విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీల్లో కుటుంబాలు పెరిగాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్తగా కార్డ్‌లు లేకపోవడంతో పథకాలు అందలేదన్నారు. ప్రతి పేదవాడికి రేషన్‌ కార్డ్‌లు అందిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.

డిజిటల్‌ కార్డ్‌లో ఫ్యామిలీ వివరాలు ఉంటాయని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అన్ని పథకాలకు ఒకటే కార్డ్‌ అదే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ అంటూ చెప్పుకొచ్చారు. ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్‌ సంబంధించిన వివరాలన్నీ అందులో ఉంటాయని చెప్పారు. పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. పేదలు నగరాలకు వస్తే.. వారు ఉన్న ప్రాంతంలోనే రేషన్‌ తీసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. అయితే.. నియోజకవర్గానికి రెండు చోట్ల దీన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అక్కడ ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Next Story