మ‌న‌ సంస్కృతి ప్రపంచానికి ఆద‌ర్శం : సీఎం కేసీఆర్‌

CM KCR Wishes To Telangana Public. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు

By Medi Samrat
Published on : 21 May 2021 8:37 AM IST

CM KCR

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవజాతి ప్రగతికి సంస్కృతి.. ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. విభిన్న మతాలు, కులాలు, భాషలు, జీవన విధానాలు , కట్టు, బొట్టు, ఆహార వ్యవహారాలతో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తున్న భారతీయ సంస్కృతి, మహోన్నతమైనదని సీఎం పేర్కొన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులకు కేంద్రంగా, జీవన వైవిధ్యానికి వేదికగా, మినీ ఇండియాగా తెలంగాణ నిలవడంలో ఇక్కడి సాంస్కృతిక జీవన విధానం, దండలో దారమై కొనసాగుతున్నదన్నారు.

గంగా-జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శమని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్న దని, భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో తెలంగాణ ఘనతను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎత్తి పడుతున్నదని సీఎం అన్నారు. సబ్బండ వర్గాల భాష, సంప్రదాయ, సాంస్కృతిక, అస్తిత్వ జీవన తాత్విక కు తెలంగాణ ప్రభుత్వం పబ్బతి పడుతున్నదని సీఎం తెలిపారు.


Next Story