సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోద ఆస్పత్రికి హుటాహుటిన..

CM KCR who went to Yashoda Hospital due to slight illness. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఎడమ చేయి లాగడంతో పాటు

By అంజి  Published on  11 March 2022 6:42 AM GMT
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోద ఆస్పత్రికి హుటాహుటిన..

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఎడమ చేయి లాగడంతో పాటు, నీరసంగా ఉండటంతో.. హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్ళారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేయించుకోనున్నారు. కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. ఆయన నేటి యాదాద్రి పర్యటన రద్దయింది. రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌గా వీక్‌గా ఉన్నారని డా.ఎం.వి.రావు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని, ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామని తెలిపారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని ఎం.వి.రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతోష్‌ కుమార్‌లు ఉన్నారు. కాగా త్వరలోనే సీఎం కేసీఆర్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలకు వెళ్లి వచ్చారు.

Next Story