యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

CM KCR welcomes opposition presidential candidate Yashwantsinha.రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల అభ్య‌ర్థిగా పోటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 7:22 AM GMT
యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల అభ్య‌ర్థిగా పోటి చేస్తున్న య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరుకున్నారు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్ర‌త్యేక విమానంలో ఆయ‌న బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం బేగంపేట‌ ఎయిర్‌పోర్ట్ నుంచి జ‌ల‌విహార్‌కు బైక్ ర్యాలీగా త‌ర‌లివెళ్లారు.

కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఒకే వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్క ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వీరు జలవిహార్ కు వెళ్తున్నారు. వీరి కాన్వాయ్ కు ముందు బైక్ ర్యాలీ కొనసాగుతోంది. వేలాది బైక్ లు ముందుకు సాగుతుండగా కేసీఆర్ కాన్వాయ్ వారిని అనుసరిస్తోంది. రోడ్డు మొత్తం టీఆర్ఎస్ జెండాలతో గులాబీమయంగా మారింది. కాసేప‌ట్లో వారి ర్యాలీ జ‌ల‌విహార్‌కు చేరుకోనుంది. అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం కేసీఆర్‌, య‌శ్వంత్ సిన్హా ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ సైతం ఈ ప్రచారంలో పాల్గొనుండ‌డంతో పాటు ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

మ‌రోవైపు.. బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్‌ఎస్‌ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.

Next Story