కరోనా నుండి కోలుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR Tested For Covid Negative. సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎంకు కొవిడ్ నెగెటివ్ నిర్థారణ అయింది.

By Medi Samrat  Published on  28 April 2021 10:37 PM IST
CM KCR tested negative

సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎంకు కొవిడ్ నెగెటివ్ నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19న కేసీఆర్ కొవిడ్ పరీక్ష చేసుకోగా.. పాజిటివ్ వచ్చింది. అప్పట్నుంచి వైద్యుల సూచన మేరకు సీఎం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఐసోలేషన్​లో ఉన్నారు. వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది.

మధ్యలో ఒకసారి సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌.. సీటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేసుకున్నారు. ఛాతీలో ఎలాంటి ఇన్​ఫెక్షన్ లేదని సీటీ స్కాన్​లో తేలినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు మరోమారు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ యాంటీజెన్​తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్​లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు రేపు రానున్నాయి.


Next Story