వ‌ర‌ద‌బాధిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే రూ.10వేల సాయం : సీఎం కేసీఆర్‌

CM KCR Speech at Bhadrachalam.వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. వంతెన పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 1:17 PM IST
వ‌ర‌ద‌బాధిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే రూ.10వేల సాయం :  సీఎం కేసీఆర్‌

వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు. వంతెన పై నుంచి గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. ఆ త‌రువాత‌ సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సంద‌ర్శించారు. అక్కడ ముంపు బాధితులను ముఖ్య‌మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి ఆరా తీశారు.


అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన కాలనీలు నిర్మిస్తామని చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రస్తుతం 70 అడుగుల వరకూ చేరిందని భవిష్యత్తులో 90అడుగులకు చేరినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాల‌నీల నిర్మాణం చెప‌డుతామ‌ని అన్నారు. భారీ వ‌ర్షాల దృష్ట్యా నెలాఖ‌రు వ‌ర‌కు అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణ సాయం కింద వరద బాధితులకు రూ.10 వేలు సాయం అందిస్తామ‌ని అంతేకాకుండా మరో రెండు నెలల పాటు కుటుంబానికి ఉచితంగా 20 కిలోల బియ్యం అందజేస్తామని తెలిపారు. భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్ధికి కృషి చేస్తాన‌ని త‌దుప‌రి ప‌ర్య‌ట‌న‌లో దీనిపై ప‌ర్యవేక్షిస్తాన‌ని చెప్పారు.

తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.


Next Story