ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం కేసీఆర్
CM KCR Signed On RTC Job Security Guidelines. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది.
By Medi Samrat Published on
4 Feb 2021 4:13 PM GMT

ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
Next Story