తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించారు. భూ రికార్డుల సమస్యల పరిష్కారం పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మిగిలిన భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున 100 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్, డీఆర్‌వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఈ నెల 11న ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన అవగాహన సదస్సు జరగనుంది. ఈ అవగాహన సదస్సుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు.