సీఎం కేసీఆర్‌తో నేడు త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశం

CM KCR Review On PRC. ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్ష‌తన సీఎం కేసీఆర్‌తో నేడు త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశం.

By Medi Samrat
Published on : 11 Jan 2021 9:03 AM IST

CM KCR Review Meeting

ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్ష‌తన త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. నేడు ఆ త్రిస‌భ్య క‌మిటీ.. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో స‌మావేశం కానుంది. ఈ రోజు మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎం భేటీ ఉండ‌గా.. అంత‌కంటే ముందే ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

సోమేశ్ కుమార్ నేతృత్వంలోని ఈ క‌మిటీ వేత‌న స‌వ‌ర‌ణ‌, ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు, ప‌దోన్న‌తులు, కారుణ్య నియామ‌కాల‌పై సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించే అవ‌కాశం ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉద్యోగుల‌ను రాష్ట్రానికి ర‌ప్పించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌పై సీఎంకు త్రిస‌భ్య క‌మిటీ వివ‌ర‌ణ ఇవ్వ‌నుంది. పీఆర్సీపై అధ్య‌య‌నం, ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల‌తో భేటీపై చ‌ర్చించ‌నున్నారు.


Next Story