సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్.. మీమ్స్ వైరల్

CM KCR press meet.. memes viral. 'కట్టప్పా.. కాకరకాయా..? బీజేపీ దేశాన్ని జలగలా పట్టుకుంది', 'మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే.. నువ్వు గోక్కోకున్నా నేను

By అంజి  Published on  11 July 2022 5:56 AM GMT
సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్.. మీమ్స్ వైరల్

'కట్టప్పా.. కాకరకాయా..? బీజేపీ దేశాన్ని జలగలా పట్టుకుంది', 'మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే.. నువ్వు గోక్కోకున్నా నేను గోకుతూనే ఉంటా' తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్‌మీట్‌లో అన్నమాటలివి. కేంద్రంపై కేసీఆర్‌ చేసిన కామెంట్లపై సోషల్‌ మీడియాలో మీమ్‌లు తెగ వైరల్‌ అవుతున్నాయి. 'నేను అబద్ధాలు చెప్ప.. నన్ను చంపిన కూడా అబద్ధాలు చెప్ప' ఇది తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ బహిరంగ సభలో చెప్పిన మాట. ఈ కామెంట్‌తో కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతుగా గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను, ఇప్పుడు చేసిన వ్యాఖ్యల వీడియోను మీమ్స్ పేజీలు వైరల్‌ చేస్తున్నాయి.

మోడీ వచ్చి ఏదో చెప్తాడనుకుంటే ఏమి చెప్పలేదని. వేములవాడ రాజన్న ఏడుపాయల దుర్గమ్మ ఇదే కదా మోడీ చెప్పిందని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైరల్‌ అవుతున్న మీమ్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు 'కేసీఆర్.. మామూలోడు కాదని', 'ఏం చేద్దాం అంటావ్‌ మరీ', 'రాహుల్‌ బ్రో.. నువ్వు చెప్పొచ్చు కదా' అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

2018లో కేసీఆర్‌ మాటలు.. తాను మోదీకి వ్యతిరేకం కాదని, ప్రధాని మోదీ నిర్ణయాలను తాను గౌరవిస్తుంటా, మోదీకి తాను బెస్ట్‌ ఫ్రెండ్‌, బీజేపీకి కూడా తాను వ్యతిరేకం కాదు.

2022లో కేసీఆర్ మాటలు.. ఇది నిజం.. భారతదేశ చరిత్రలోనే అసమర్థమైనటువంటి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ఏ ప్రధాని కూడా చేయని విధంగా మోదీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it