న‌ల్ల‌గొండ జిల్లాలో 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న

CM KCR lays foundation for 13 irrigation projects at Nalgonda.న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జుసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2021 9:40 AM GMT
CM KCR lays foundation for 13 irrigation projects at Nalgonda

న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జుసాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా రూ.3వేల కోట్ల వ్య‌వ‌యంతో నిర్మించ‌నున్న నెల్లిక‌ల్లు ఎత్తిపోత‌ల‌తో పాటు మ‌రో 12 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ర‌వీంద్ర నాయ‌క్‌తో త‌దిత‌రులు పాల్గొన్నారు.

కొత్త‌గా చేప‌ట్ట‌నున్న ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందనుంది. యాదాద్రి జిల్లాలోని గంధ‌మ‌ల్ల‌, బ‌స్వాపూర్ గ్రామాల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ని అధికారులు తెలిపారు. ఎత్తిపోత‌ల‌తో ఉమ్మ‌డి న‌ల్ల‌గోండ జిల్లాలోని చివ‌రి భూముల‌కు కృష్ణా జ‌లాలు చేర‌నున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు. హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొన‌నున్నారు. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌చ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ శ్రేణుల‌కు నూత‌నోత్సాహాన్ని నింపేందుకు బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్ర‌సంగించ‌నున్నారు.


Next Story
Share it