హైద‌రాబాద్‌లోని నిరుపేద‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 6:52 AM GMT
CM KCR, Independence Day, Golconda, Good News, Hyderabad,

 హైద‌రాబాద్‌లోని నిరుపేద‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు 

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశాన్ని విముక్తి చేసేందుకు ఎంతోమంది ప్రాణాలను అర్పించారని గుర్తుచేసుకున్నారు సీఎం కేసీఆర్.

అయితే.. గతంలో తెలంగాణలో ఎటు చూసినా ఆకలి కేకలు, ఆత్మహత్యలతే ఉండేవని చెప్పారు కేసీఆర్. విధ్వంసమైన తెలంగాణను అభివృద్ధివైపు నడిపించామని తెలిపారు. తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలను సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ చేస్తుందే.. దేశం మొత్తం ఆచరిస్తోందని అన్నారు. గతంలో కరెంటు కోతలు ఉండేవని.. ఇప్పుడు విద్యుత్‌ వెలుగు కనిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. పంట కాలువలు, పచ్చని చేలతో తెలంగాణ కళకళలాడుతోందని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా అవరోధాలు తొలగిపోయాయని.. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా డబుల్‌బెడ్రూం ఇళ్లను కట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. 77వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచే లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లును అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్లు ఇరుకుగా ఉండేవని.. కానీ తమ ప్రభుత్వ నిర్మిస్తోన్న ఇళ్లు విశాలంగా ఉన్నాయని చెప్పారు. డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు సీఎం కేసీఆర్.

అంతేకాక.. సొంతంగా స్థలం ఉండి ల్లు నిర్మించుకోలేని పేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తెచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో రూ.3లక్షల సాయం అందిస్తున్నది చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3వేల మందికి ముందుగా ఈ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం అందించే గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Next Story