అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌తి.. పెద్ద మనసు చాటుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR helps to Shivani treatment.సీఎం కేసీఆర్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 12:20 PM IST
అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువ‌తి.. పెద్ద మనసు చాటుకున్న సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా అనే అరుదైన వ్యాధితో ఓ విద్యార్థిని బాధ‌ప‌డుతోంది. ఈ విష‌యం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్ల‌గా.. యువ‌తి ప‌రిస్థితిని తెలుసుకుని చ‌లించిన సీఎం.. ఆయువ‌తికి చికిత్స‌కు రూ.25ల‌క్ష‌లు మంజూరు చేశారు. యువ‌తికి మంచి వైద్యాన్ని అందించాల‌ని ఆదేశించారు. వివ‌రాల్లోకి వెళిళే.. వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన శివాని రోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (పిఎన్‌హెచ్‌) అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఈ వ్యాధి ముదిరితే యువ‌తి ప్రాణాల‌కే ప్ర‌మాదం. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌తో యువ‌తి ప్రాణాలు కాపాడే అవ‌కాశం ఉంది. అయితే.. ఆ చికిత్స‌కు దాదాపు రూ.30ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

శివాని కుటుంబం 20 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం వలసవెళ్లి హైదరాబాద్ పీర్జాదిగూడలో స్థిరపడింది. క్యాబ్ డ్రైవర్ అయిన తండ్రి బాల్ రెడ్డి పరిస్థితిని వనపర్తి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంట‌నే స్పందించిన మంత్రి.. విష‌యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. శివాని ప‌రిస్థితిని విని సీఎం చ‌లించిపోయారు. శివాని చికిత్స‌కు రూ.25ల‌క్ష‌ల ఎల్ఓసీ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి చెక్‌ను ఇవాళ వనపర్తిలోని తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స చేయ‌నున్నారు. తమ కూతురు వైద్యానికి సాయం చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్ రెడ్డికి శివాని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story