7న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

CM KCR Conduct A Party Meeting on Sunday. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 7న‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  5 Feb 2021 1:50 PM IST
CM KCR Conduct A Party Meeting on Sunday.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 7న‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ వేదిక‌గా కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు మంత్రులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.




Next Story