డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ విషయం ప్రజలకు చెప్పేందుకే.!

CM KCR calls for week-long winter session of Telangana Assembly in December. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌ నెలల జరగనున్నాయి. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను

By అంజి  Published on  24 Nov 2022 7:02 PM IST
డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ విషయం ప్రజలకు చెప్పేందుకే.!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్‌ నెలల జరగనున్నాయి. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ''అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇలాంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోంది'' అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీని ప్రకారం శాసన సభ నిర్వహణ తేదీలను ఖరారు చేసేందుకు మంత్రులిద్దరూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులతో చర్చించాలని భావిస్తున్నారు.

Next Story