BRS Manifesto: రైతుబంధు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంపు

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించారు.

By Srikanth Gundamalla  Published on  15 Oct 2023 9:07 AM GMT
CM KCR, BRS, Menifesto, Telangana elections ,

BRS Manifesto: రైతుబంధు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంపు

కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి చాలా పథకాలను ఏ మానిఫెస్టోలో ప్రకటించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ.. మాకు మేంగా పరిపాలన జరుగుతున్న క్రమంలో కేబినెట్ సమావేశాలు ఏర్పాటు ప్రజల కోసం తీసుకొచ్చామని చెప్పారు. బీఆర్ఎస్‌ ఎన్నికల్లో ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉన్నాయి. అలాగే మేనిఫెస్టోలో ఉన్న పథకాలను కూడా అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఒక్క సందర్భంలో కూడా మతకల్లోలాలు లేకుండా.. అందరి పండుగలను సమానంగా గౌరవిస్తూ.. ప్రభుత్వం తరపున సహాయాలు అందిస్తున్నామని చెప్పారు. పదేళ్లలో తెలంగాణలో ఒక్క గొడవ కూడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మంచి విలువలు తమ ప్రభుత్వం నెలకొల్పిందని.. ఇది కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

* భారత చరిత్రలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయని విధంగా దళితబంధు తెచ్చామని అన్నారు. అప్పుడే ప్రభుత్వాలు ఆలోచన చేసి ఉంటే పరిస్థితులు మారేవని అన్నారు. రూ.10లక్షల ఆర్థికసాయం దళితులకు ఇస్తున్నామని.. ఈ పథకం అలాగే కొనసాగిస్తామని చెప్పారు.

* ఆదివాసీ గిరిజనులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేశామని అన్నారు. అక్కడ స్వయం పరిపాలనతో చక్కటి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గిరిజనేతర సోదరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబందు, రైతుబీమా అందిస్తోందని అన్నారు. భవిష్యత్‌లో కూడా వారి అభ్యున్నతి కోసం పాటుపడుతుందని సీఎం అన్నారు.

* పదేళ్ల క్రితం తెలంగాణకు గొర్రెలు దిగుమతి అయ్యే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు మాంసం ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. బీసీలో అందరూ అభివృద్ధి చెందుతున్నారని. వీరికి కూడా భవిష్యత్‌లో సాయం కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్.

* 3 కోట్ల పైచిలుకు టన్నుల ధాన్యం తెలంగాణలో పండుతోందని అన్నారు. రాష్ట్రం అన్నపూర్ణగా తయారైందని అన్నారు. ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రేషన్‌ కార్డులు ఉన్న అందరికీ సన్నబియ్యం ఇస్తామన్నారు. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.

* రాష్ట్రంలో తెల్లకార్డు ఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలో ఎల్‌ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా, వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లింపు.. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీని బలోపేతం చేయడానికి దోహదపడతామని సీఎం కేసీఆర్ చెప్పారు.

* ఆస‌రా పెన్షన్‌ను రాష్ట్రంలో రూ.5వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి ఏడాదిలో రూ.3,016 చేస్తామని.. ఐదేళ్ల వరకు రూ.5,016 వరకు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి ఏడాది రూ.300 పెరుగుతుంది. ప్రభుత్వంపై భారం పడదు అని సీఎం కేసీఆర్ చెప్పారు.

* దివ్యాంగులకు రూ.4,016వేలకు పెంచాం.. దాన్ని తాజాగా రూ.6,016కి పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐదేళ్లు పూర్తయ్యే వరకు రూ.6,016 వరకు పెంచుతామని అన్నారు సీఎం.

* తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తాం.

రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16వేలకు పెంపు. మొదటి ఏడాదిలో రూ.12వేలకు పెంచుతాం. ఐదేళ్లు పూర్తయ్యే నాటికి రూ.16వేలకు పెంచుతాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

* అర్హులైన పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి.. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అందజేస్తామని సీఎం చెప్పారు.

* అర్హులైన లబ్ధిదారులకు రూ.400 కింద సిలిండర్‌ అందించాలని నిర్ణయం.. అలాగే అక్రిడేషన్ జర్నలిస్టులకు కూడా రూ.400 కింద సిలిండర్ అందజేస్తామన్నారు సీఎం కేసీఆర్.

* ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధికశాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నది. ఇపుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

* రాష్ట్రంలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను సమకూరుస్తామని చెప్పారు. ప్రస్తుతం అమలు అవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉందని.. దాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

* అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్‌ స్కూళ్లు. రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తామన్నారు. అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.

* రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నామన్నారు సీఎం.

* సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం - నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు..

* ఆర్ఫాన్‌ పాలసీని పటిష్టంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

* ASSIGNED LANDS WILL BE FREE FROM HOLD

* MINORITY WELFARE WILL BE INCREASED

Next Story