ఎల్బీన‌గ‌ర్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

CM KCR Bhumipooja For LB Nagar TIMS.ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2022 7:07 AM GMT
ఎల్బీన‌గ‌ర్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

ఎల్బీన‌గ‌ర్ ప‌రిధిలోని గ‌డ్డి అన్నారంలో టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్ప‌త్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం భూమి పూజ చేశారు. మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కిష‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 21.36 ఎక‌రాల్లో ఈ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. 14 అంత‌స్తుల్లో వెయ్యిప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో ఈ ఆస్ప‌త్రి నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. 300 ఐసీయూ బెడ్స్, 16 ఆప‌రేష‌న్ థియేట‌ర్లు ఉండేలా నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ప్ర‌భుత్వం రూ.900 కోట్లు కేటాయించింది.

దేశానికే తలమానికంగా ఉన్న ఢిల్లీ ఎయిమ్స్‌ తరహాలో హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు కేసీఆర్ సిద్ద‌మైంది. మూడు టిమ్స్ ఆస్ప‌త్రుల నిర్మాణానికి రూ.2,679 కోట్ల కేటాయించింది. అల్వాల్‌ (బొల్లారం), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌)లో టిమ్స్ ఆస్ప‌త్రుల‌ను నిర్మించ‌నున్నారు. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లో జీ+14 విధానంలో ఆస్ప‌త్రి భవనాలు నిర్మిస్తారు. అల్వాల్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతం కావడంతోపాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపడతారు. ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి.

Next Story
Share it