నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే
CM KCR Bangalore tour schedule.జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు(గురువారం)
By తోట వంశీ కుమార్ Published on 26 May 2022 10:02 AM ISTజాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు(గురువారం) బెంగళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా బెంగళూరు నగరంలోని ప్రధాన కూడళ్లల్లో అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన షెడ్యూల్ ఇదే..
- ఉదయం 9.45 కి ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరుకు బయలుదేరనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్ కి వెళతారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు దేవగౌడతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. దేశ రాజకీయాలపై,రాష్ట్రపతి అభ్యర్థి పై ఈ భేటీలో చర్చించనున్నారు. మధ్యాహ్నాం 3.45 కి దేవగౌడ నివాసం నుంచి హాల్ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు హాల్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సాయంత్ర 5.10 గంటలకు ప్రగతి భవన్‌కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులతో సీఎం కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే.