పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామ‌కం

CM KCR appoints chairpersons to five State level organisations.నామినేటెడ్ పదవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 6:06 AM GMT
పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామ‌కం

నామినేటెడ్ పదవుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆశావహులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. పార్టీలో కీల‌కంగా ప‌నిచేసిన నాయ‌కుల‌కు వ‌రుస‌గా ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. తాజాగా ప‌లు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించారు. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్ ను నియ‌మించారు.

- తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత

- తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్

- తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు

- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్

- తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌

ఇక ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వులు వెలువ‌డ‌నున్నాయి. ఇక సీఎం కేసీఆర్ చైర్మ‌న్ల‌ను నియామ‌కం చేయ‌డంతో పార్టీలోని కొంద‌రు నాయ‌కుల్లో కాస్త అసంతృప్తి నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it