టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించిన కేసీఆర్‌.. వీరే

CM KCR announces new district presidents.తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) జిల్లా అధ్య‌క్షుల‌ను ఆ పార్టీ అధ్య‌క్షుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2022 7:08 AM GMT
టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించిన కేసీఆర్‌.. వీరే

తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ఎస్‌) జిల్లా అధ్య‌క్షుల‌ను ఆ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ నియ‌మించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల‌కు సంబంధించిన అధ్య‌క్షుల‌ను బుధ‌వారం నియ‌మించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం త‌రువాత తొలిసారి జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.

ఆదిలబాద్ - జోగురామన్న, కొమురం భీం - కోనప్ప, మంచిర్యాల - బాల్క సుమన్, నిర్మల్ - విఠల్ రెడ్డి, నిజామాబాద్ - జీవన్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల - తోట ఆగయ్య, కామారెడ్డి - ముజబుద్దీన్, కరీంనగర్ - రామకృష్ణారావు, జ‌గిత్యాల - విద్యాసాగర్ రావు, పెద్దపల్లి - కోరకంటి చందర్, మెదక్ - పద్మా దవేేందర్ రెడ్డి, సంగారెడ్డి - చింతా ప్రభాకర్, సిద్ధిపేట - కొత్త ప్రభాకర్ రెడ్డి, వరంగల్ - ఆరూరి రమేష్, హన్మకొండ - దాస్యం వినయ భాస్కర్, జనగామ - సంపత్ రెడ్డి, మహబూబాబాద్ - మాలోతు కవిత, ములుగు - కుసుమ జగదీష్, జయశంకర్ భూపాలపల్లి - గండ్ర జ్యోతి, ఖమ్మం - తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం - రేగా కాంతారావు, నల్లగొండ - రమావత్ రవీంద్ర కుమార్, సూర్యాపేట - బడుగుల లింగయ్య, యాదాద్రి భువనగిరి - కంచర్ల రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి - మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ - మెతుకు ఆనంద్, మేడ్చల్ - శంభీపూర్ రాజు, మహబూబ్ నగర్ - సి. లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు - గువ్వల బాలరాజు, జోగులాంబ గద్వాల - బి. కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట - రాజేందర్ రెడ్డి, వనపర్తి - ఏర్పుల గట్టు యాదవ్, హైదరాబాద్ - మాగంటి గోపీనాధ్ లు జిల్లా అధ్య‌క్షులుగా కొన‌సాగ‌నున్నారు.

పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల జరిగిన ప్లీనరీలో రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల నియామక బాధ్యతలను సీఎం కేసీఆర్‌కే అప్పచెబుతూ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనే పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు.

Next Story