వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్న సీఎం కేసీఆర్

CM KCR Aerial Survey on Godavari Floods on Tomorrow.వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదియం ఉద‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 6:51 AM GMT
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్న సీఎం కేసీఆర్

వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదియం ఉద‌యం ఏరియ‌ల్ స‌ర్వే చేయ‌నున్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా నెల‌కొన్న వ‌ర‌ద న‌ష్టం, గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లో పోటెత్తిన వ‌ర‌ద‌పై స‌మీక్షించ‌నున్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌డెం నుంచి భ‌ద్రాచ‌ల వ‌ర‌కు ఉన్న గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాన్ని ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా ప‌రిశీలించ‌నున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు. ఇప్ప‌టికే అధికారులు ఏరియ‌ల్ స‌ర్వేకు సంబంధించిన రూట్ మ్యాప్ స‌హా భ‌ద్ర‌తా ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా అంటువ్యాధులు ప్ర‌జ‌లే అవ‌కాశం ఉంది. దీని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అంటువ్యాధులు ప్ర‌జ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు గోదావ‌రి వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లోని ఆస్ప‌త్రుల‌కు చెందిన డాక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు.

Next Story
Share it