ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన గురువారం మద్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. సిఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అయితే.. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో, వాటిని గురువారం మద్యాహ్నం ఆసుపత్రిలో నిర్వహించనున్నారు. దీంతో కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇదిలావుంటే.. ఈ ఉదయం కేసీఆర్.. తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.