మునుగోడులో హోరాహోరీ పోరు.. రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యం.. నాలుగు రౌండ్లు పూర్తి

Choutuppal votes counting complete in Munugode.మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 10:46 AM IST
మునుగోడులో హోరాహోరీ పోరు.. రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యం.. నాలుగు రౌండ్లు పూర్తి

ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. టీఆర్ఎస్‌, బీజేపీలు మ‌ధ్య నువ్వా, నేనా..? అన్న‌ట్లు పోరు నెల‌కొంది. రౌండు రౌండుకు ఆధిక్యం మారుతోంది. నాలుగు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు పూర్తి అవ్వ‌గా.. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ కు ఆధిక్యం ల‌భించగా రెండు, మూడు బీజేపీ ఆధిక్యం కొన‌సాగింది. నాలుగో రౌండ్ లో మ‌ళ్లీ టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ 1034 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

రౌండ్ల వారీగా వివ‌రాలు..

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6096, బీజేపీకి 4904

రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7771, బీజేపీకి 8622

మూడో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 7010, బీజేపీకి 7426

నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 4854, బీజేపీకి 4,555

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు.


Next Story