Nagarkurnool: భర్త ప్రైవేట్ పార్ట్‌ని నరికేసిన భార్య

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండల పరిధిలోని ఓ గ్రామంలో చెంచు మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో అతని ప్రైవేట్ పార్ట్‌ని నరికేసింది.

By అంజి  Published on  20 Oct 2024 1:30 PM IST
Chenchu woman, husband,  argument, Nagarkurnool

Nagarkurnool: భర్త ప్రైవేట్ పార్ట్‌ని నరికేసిన భార్య 

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని లింగాల మండల పరిధిలోని ఓ గ్రామంలో చెంచు మహిళ తన భర్త నిద్రిస్తున్న సమయంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో అతని ప్రైవేట్ పార్ట్‌ని నరికేసింది. ఈ ఘటన గత వారం జరిగినప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ చెంచు తెగకు చెందినవారు. తరచూ వేర్వేరు సమస్యలపై గొడవలు పడుతున్నారని సమాచారం. ఈసారి వాదనకు ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, భర్త ప్రవర్తనతో భార్య కలత చెందిందని నివేదికలు చెబుతున్నాయి.

అతను నిద్రిస్తుండగా, కోపోద్రిక్తురాలైన భార్య అర్థరాత్రి అతని ప్రైవేట్ భాగాలను నరికివేసింది. అతను గట్టిగా కేకలు వేయడంతో ఆందోళన చెందిన ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకుని లింగాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో అతడిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story