తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస మర్యాద తెలియదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
By Medi Samrat Published on 12 Nov 2022 4:16 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస మర్యాద తెలియదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలన్న సంస్కారం కూడా లేదన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు. కిరాయి రౌడీలతో బ్యానర్లు కట్టినంత మాత్రాన మోదీని అడ్డుకోలేరన్నారు. మళ్లీ మళ్లీ వస్తాం.. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏం చేయలేరన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణకు ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తిస్తోందని.. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్‌కి రాష్ట్ర అభివృద్ధి పట్టదన్నారు. కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాదని.. నిజాం రాజ్యాంగం కావాలంటున్నారని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Next Story