బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

Case filed against bandi sanjay, Akbaruddin.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం

By సుభాష్  Published on  28 Nov 2020 10:35 AM IST
బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సుమోటో కింద పోలీస్‌ శాఖ కేసు నమోదు చేసింది. ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దారుసలాం, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్‌ ఘాట్‌ కూల్చివేత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ స్పందిస్తూ... 'ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Next Story