సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి

Candle Blast In CM KCR Birthday Ceremony. వ‌రంగ‌ల్ లోని కరీమాబాద్‌లో నిర్వ‌హించిన బ‌ర్త్ డే వేడుక‌ల్లో అప‌శ్రుతి చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 17 Feb 2021 1:34 PM IST

Candle Blast In CM KCR Birthday Ceremony

సీఎం కేసీఆర్ 67వ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. పెద్దఎత్తున సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ.. శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే.. వ‌రంగ‌ల్ లోని కరీమాబాద్‌లో నిర్వ‌హించిన బ‌ర్త్ డే వేడుక‌ల్లో అప‌శ్రుతి చోటుచేసుకుంది.

వివ‌రాళ్లోకెళితే.. క‌రీమాబాద్‌లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్‌లో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది. ఆ మంటలు పేపర్లకు అంటుకోవడంతో.. నేతలు, కార్య‌క‌ర్త‌లు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. సంఘటన జరిగిన సమయంలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Next Story