Warangal: వాగులో చిక్కుకున్న బస్సు.. సాయం కోసం ప్రయాణికుల ఎదురుచూపు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 1 Sept 2024 8:00 AM

Warangal: వాగులో చిక్కుకున్న బస్సు.. సాయం కోసం ప్రయాణికుల ఎదురుచూపు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా వరంగల్‌ జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయింది. రాత్రి నుంచి వరద దాటలే దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

వరంగల్‌ నుంచి మహబూబాబాద్‌కు TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు బయల్దేరింది. నెక్కొండ-వెంకటాపురం చెరువు కట్టపైకి వచ్చే సరికి వరద ప్రవాహం ఎక్కువ అయ్యింది. దాంతో.. కాసేపయ్యాక వరద తగ్గుతుందని భావించి బస్సును అక్కడే నిలిపారు. కానీ.. వర్షం నిరంతరాయం కురవడంతో వదర ప్రవహిస్తూనే ఉంది. అంతకంతకూ పెరుగుతోంది. బస్సు రాత్రి నుంచి అక్కడే ఉండిపోయింది. ముందుకు వెళ్లలేక ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు అధికారులు సాయం చేయాలని కోరుతున్నారు. ముందుకి, వెనక్కి వెళ్లలేని స్థితిలో ఉన్నామనీ.. అధికారులు సాయం చేసి కాపాడాలని అంటున్నారు. తాము రాత్రి అక్కడే ఉండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాగా.. బస్సులో 45 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.



Next Story