పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు
Bus car collision in Peddapally District.పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారును
By తోట వంశీ కుమార్ Published on
6 Oct 2021 4:15 AM GMT

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొని అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 16 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంథని మండలం ఎక్లాస్‌పూర్ వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెలుతోంది. ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో కారును ఢీ కొట్టింది. దీంతో రెండు అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని 16 మంది ప్రయాణీకులకు స్వల్పగాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story