అయోధ్య ఆహ్వానం మాకు అందలేదు: ఎమ్మెల్సీ కవిత
అయోధ్య నుంచి బీఆర్ఎస్‌కు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత చెప్పారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 1:15 PM ISTఅయోధ్య ఆహ్వానం మాకు అందలేదు: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. మహాత్మా జ్యోతిరావుపూలె విగ్రహాన్ని తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆధునిక భారతదేశంలో పునుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావుపూలే చేసిన కృషి చిరస్మరణీయం అని ఆమె పేర్కొన్నారు. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
స్పీకర్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌కు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు. అయితే.. రాముడి కొందరివాడు కాదు.. అందరి వాడు అని వ్యాఖ్యనించిన కవిత త్వరలో అయోధ్య రామమందిరానికి వెళ్తానని చెప్పారు. ఇతర ఆలయాలను ఎలా సందర్శిస్తామో.. అలాగే ఏదో ఒక సందర్భంలో అయోధ్య రామాలయానికి కూడా వెళ్తానన్నారు. కాగా.. రేపు మాత్రం బీఆర్ఎస్‌కు ఎలాంటి ఆహ్వానం అందకపోవడం వల్లే తాను అయోధ్యకు వెళ్లలేట్లదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
అయోధ్యకు రావాలని బీఆర్ఎస్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు: ఎమ్మెల్సీ కవిత pic.twitter.com/9qTb6Bpt2L
— Newsmeter Telugu (@NewsmeterTelugu) January 21, 2024