జగిత్యాల: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత (వీడియో)
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:00 PM ISTజగిత్యాల: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎమ్మెల్సీ కవిత స్పృహ తప్పి వాహనంలోనే కింద పడిపోయారు. ఆ సంఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాసేపు ప్రచారాన్ని నిలిపేసి కవిత కోలుకునే వరకు ఆగిపోయారు. అయితే.. కాసేపటికే ఎమ్మెల్సీ కవిత మళ్లీ తేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
డీహైడ్రేషన్ వల్ల కవతి కళ్లు తిరిగి కిందపడిపోయారని చెబుతున్నారు. అయితే.. వాహనంలోని కిందకు దిగిన కవిత అక్కడే ఉన్న ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి మళ్లీ ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రచారంలో భాగంగా ప్రసంగం కూడా చేశారు. నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనడం.. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఆమె స్పృహ తప్పి పడిపోయిన వార్త బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన కలిగించింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా అంతకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణ ను ప్రతిబింబిం చేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దానిని వీడియోలో ఆమె చిత్రీకరించారు.