లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఎమ్మెల్యే లాస్య నందిత, తప్పిన ప్రమాదం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 2:43 PM IST
brs, mla lasya nanditha, stuck,  lift, secunderabad,

లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఎమ్మెల్యే లాస్య నందిత, తప్పిన ప్రమాదం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే లాస్య నందిత ఆదివారం రోజు సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అక్కడ లిఫ్ట్‌లో ఎక్కిన ఆమె ప్రమాదంలో పడ్డారు. లిఫ్ట్‌ ఓవర్‌ లోడ్‌ అవ్వడంతో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌ వరకు వెళ్లిపోయింది. దాంతో.. లిఫ్ట్‌ డోర్లు తెరుచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించిన భవనం సిబ్బంది, సెక్యూరిటీ లిఫ్ట్‌ డోర్లను బలవంతంగా తెరిచి లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు.

లిఫ్ట్‌ డోర్లను పెద్ద ఇనుప రాడ్లతో బలవంతంగా ఓపెన్‌ చేశారు. లిఫ్ట్‌లో ఎమ్మెల్యే లాస్య నందితో పాటు మరికొందరు మహిళలూ ఉన్నారు. అయితే.. లిఫ్ట్‌ డోర్లను బద్దలు కొట్టి చివరకు అందరినీ బటయకు తీసుకొచ్చారు. క్షేమంగా ఎమ్మెల్యేతో పాటు అందరూ బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. లిఫ్ట్‌ నుంచి బయటకు వచ్చాక యథావిధిగా ఎమ్మెల్యే లాస్య నందిత తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే లిఫ్ట్‌లో ఇరుక్కున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. కంటోన్మెంట్‌ అసెంబ్లీ టికెట్‌ను బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆశించాడు. అయితే.. కంటోన్మెంట్‌ టికెట్‌ను లాస్య నందితకే పార్టీ నాయకత్వం కేటాయించింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దర్ కూతురు వెన్నెలపై లాస్య నందిత విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. సాయన్న మృతితో ఆయన కూతురు లాస్య నందికు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించారు.



Next Story