ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్‌రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 1:45 PM IST
brs leaders, resign,  mlc posts, telangana,

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్‌రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అందించారు. చైర్మన్‌ చాంబర్‌లో గుత్తా సుఖేందర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేయగా.. వాటికి గుత్తా ఆమోదం తెలిపారు. కాగా.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. దాంతో.. తాజాగా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

తాగాజా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీని బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ స్పీకర్‌ ఎన్నిక తర్వాతే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేస్తారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. ఇక కేసీఆర్, కేటీఆర్ కూడా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేదు. కేసీఆర్‌ కాలుకి గాయం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కేటీఆర్ కూడా తన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆస్పత్రిలో ఉన్నాననీ.. ప్రమాణస్వీకారానికి మరొక రోజు సమయం ఇవ్వాలని కేటీఆర్ శాసన సభ సెక్రటరీని కోరారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశానికి కూడా హాజరుకాలేకోయానని చెప్పారు.

ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈసారి అసెంబ్లీకి 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Next Story